Wed Jan 28 2026 02:51:17 GMT+0000 (Coordinated Universal Time)
Jubilee Hills by-election : తొలిరోజు పది నామినేషన్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు పది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అధికారిక ఎన్నికల ప్రకటనతో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లు దాఖలుకు చివరి తేదీగా ఈ నెల 21వ తేదీ వరకూ నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22వ తేదీన ఉండనుంది.
11న పోలింగ్...
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబరు 14వ తేదీన జరగనుంది. అర్హత ఉన్న 25 ఏళ్ల పైబడిన అభ్యర్థులు స్వయంగా లేదా డిజిటల్ నామినేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయవచ్చని అధికారులు చెప్పారు. నామినేషన్ ఫారంతోపాటు క్యూ ఆర్ కోడ్ ప్రతిని సమర్పించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఈ నెల 15వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Next Story

