Thu Dec 18 2025 23:05:15 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీలో చేరేందుకు సిద్ధం
బీజేపీలో చేరికలు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీలో చేరేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధమయ్యారు

బీజేపీలో చేరికలు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీలో చేరేందుకు తీన్మార్ మల్లన్న సిద్ధమయ్యారు. ముహూర్తం నిర్ణయించుకుని ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ బీజేపీలో రెండు ఉప ఎన్నికల్లో గెలిచి కొంత పట్టు నిరూపించుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడంతో చేరికలు కూడా త్వరలో మొదలవుతాయంటున్నాయి బీజేపీ వర్గాలు.
సోషల్ మీడియాలో...
తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు చేరువయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిని చివరి నిమిషం వరకూ ముప్పు తిప్పులు పెట్టిన తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కేసులు బనాయించింది. దీంతో ఆయన మూడు నెలలకు పైగానే జైలులో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తీన్మార్ మల్లన్న కలవనున్నారు.
Next Story

