Thu Dec 18 2025 10:18:18 GMT+0000 (Coordinated Universal Time)
Job Mela : నేడు హుస్నాబాద్ లో మెగా జాబ్ మేళా
హుస్నాబాద్ లో నేడు జాబ్ మేళా జరగనుంది. హస్నా బాద్ తిరుమల గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు

హుస్నాబాద్ లో నేడు జాబ్ మేళా జరగనుంది. హస్నా బాద్ తిరుమల గార్డెన్స్ లో నేడు మెగా జాబ్ మేళా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. జాబ్ మేళా లో 60 కి పైగా కంపెనీల్లో ,5000 కు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు.
అర్హత కలిగిన వారు...
18-35 సంవత్సరాల వయసు కలిగి ఏడో తరగతి నుంచి ,పదో తరగతి, ఇంటర్మీడియట్ ,డిప్లొమా , బీఏ, బీకాం,బీఎస్సీ, బీఫార్మసీ, ఏంఫార్మసీ , బీఈ,బిటెక్,ఏంటెక్, ఎంబిఏ, ఏంసిఏ,హోటల్ మేనేజ్మెంట్ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏ అర్హత ఉన్న జాబ్ మేళ లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.. జాబ్ మేళా హెల్ప్ లైన్ నంబర్స్ 9642333667,6300610339 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Next Story

