Tue Mar 10 2026 17:44:25 GMT+0530 (India Standard Time)
సాయంత్రం కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు

తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ప్రకటించింది.
త్రిపురకు చెందిన...
రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఆలస్యమయింది. ఈరోజు సాయంత్రం హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Next Story

