Tue Mar 03 2026 19:52:32 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం
తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు

తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. త్రిపురకు చెందిన బీజేపీ నేత అయిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
రాజ్‌భవన్ లో ప్రమాణ స్వీకారానికి...
అక్కడి నుంచి రాజ్‌భవన్ కు చేరుకున్న జిష్ణుదేవ్ వర్మ 5.03 గంటలకు నూతన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతన గవర్నర్ గా బాధ్యతలను చేపట్టిన జిష్ణుదేవ్ వర్మను పలువురు మంత్రులు, అధికారులు అభినందించారు.
Next Story

