Wed Mar 25 2026 11:38:56 GMT+0530 (India Standard Time)
నేడు జీవన్ రెడ్డి రాజీనామా
నేడు జగిత్యాల సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు

నేడు జగిత్యాల సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. అధికారికంగా ప్రకటించనున్నారు. జగిత్యాలలో నేడు కార్యకర్తల సమావేశం జరగనుంది. మరి కాసేపట్లో జగిత్యాలలో జరగనున్న కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నారు.
ముఖ్య కార్యకర్తల సమావేశంలో...
ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్న జీవన్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నదీ నేతలకు, ముఖ్య కార్యకర్తలకు వివరించనున్నారు. జీవన్ రెడ్డి రాజీనామాను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Next Story

