Tue Mar 17 2026 15:30:01 GMT+0530 (India Standard Time)
Jeevan Reddy : పార్టీ వీడాలంటే బాధగా ఉంది
పార్టీని వీడాలని తాను కోరుకోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని జీవన్ రెడ్డి అన్నారు

పార్టీని వీడాలని తాను కోరుకోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే తనకు ఆఫర్ ఇచ్చారని, ఎందుకు ఎవరు కలసి పనిచేయాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వస్తుంటే తనను ఎలా కలసి రమ్మంటారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారని జీవన్ రెడ్డి నిలదీశారు.
సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారంటూ...
సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని స్పీకర్ తీర్పు చెప్పారన్నారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంతో అంకిత భావంతో పనిచేశానని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంజయ్ కుమార్ కేటీఆర్, దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడని, ఎవరి కమిట్ మెంట్ ఏంటన్నది ప్రజలు గమనించాలని జీవన్ రెడ్డి కోరారు. ఇరవై మాసాల నుంచి నియోజకవర్గంలో ఏ అభివృద్ధిసాధించారో చెప్పాలన్నారు.
Next Story

