Sat Mar 07 2026 14:53:38 GMT+0530 (India Standard Time)
నిలిచిపోయిన జేఈఈ మెయిన్స్ పరీక్ష
జేఈఈ మెయిన్స్ పరీక్ష నిలిచిపోయింది. సెకండ్ సెషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా అది సాంకేతిక సమస్యతో మొదలవ్వలేదు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష నిలిచిపోయింది. సెకండ్ సెషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా అది సాంకేతిక సమస్యతో మొదలవ్వలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు జేఈఈ మెయిన్స్ సెకడం్ సెషన్ ప్రారంభం కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యతో ఇప్పటి వరకూ పరీక్ష ప్రారంభం కాలేదు. ఆరు గంటల వరకూ వేచి చూసిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.
సాంకేతిక సమస్యతో....
రెండు సెషన్స్ లో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దుండిగల్ లోని ఒక ప్రయివేటు కళాశాలలో ఈ పరీక్ష మొదటి సెషన్ బాగానే జరిగింది. రెండో సెషన్ వచ్చేసరికి సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంకా పరీక్ష ప్రారంభం కాలేదు. విద్యార్థులు తల్లిదండ్రులు బయట ఆందోళన చేస్తున్నారు. పరీక్ష ఎప్పుడు ప్రారంభమవుతుందంటూ నిర్వాహకులను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కాసేపట్లో ప్రారంభిస్తామని అధికారులు నచ్చ చెబుతున్నారు.
Next Story

