Tue Jan 20 2026 17:07:11 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించిన జనసేన
పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. కానీ.. చాలా మంది..

హైదరాబాద్ : ఇటీవల కాలంలో తెలంగాణ వరుస ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. కానీ.. చాలా మంది వయసు నిబంధన కారణంగా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు రెండేళ్ల పాటు వయోపరిమితిని సడలించాలని జనసేన విద్యార్థి విభాగం శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు నిరసనకు దిగింది.
కరోనా కారణంగా చాలామంది జీవితాలు చిన్నాభిన్నమైన నేపథ్యంలో.. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వయోపరిమితిని సడలించాలని జనసేన విద్యార్థి విభాగం తెలంగాణ అధ్యక్షుడు సంపత్ నాయక్ కోరారు. ఇది కేవలం తామొక్కరి డిమాండ్ కాదని, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న 5 లక్షల మంది నిరుద్యోగుల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
Next Story

