Wed Mar 18 2026 11:12:47 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వాహనాన్ని ఆపి... మరీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పెనుబల్లి వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను ఆపిన పోలీసులు వాహనాలన్నింటినీ తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీకి పవన్ కల్యాణ్ సహకరించారు. విజయవాడ నుంచి వాహనాల్లో బయలుదేరిన పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కొత్తగూడెం వెళుతున్నారు.
తనిఖీ చేసిన పోలీసులు...
ఈ సందర్భంగా ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ వాహనాన్ని కూడా వారు తనిఖీలు చేశారు. పవన్ కల్యాణ్ ఈరోజు కొత్తగూడెం, సూర్యాపేట ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

