Fri Mar 20 2026 20:10:29 GMT+0530 (India Standard Time)
ముగిసిన సమావేశం
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నలభై ఐదు నిమిషాల పాటు వీరి మధ్య సమావేశం జరగింది

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు వీరి మధ్య సమావేశం జరగింది. పవన్ కల్యాణ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
పొత్తులపై చర్చ...
సమావేశం ముగిసిన తర్వాత అమిత్ షా ఇంటి నుంచి పవన్ కల్యాణ్ నేరుగా వెళ్లిపోయారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగిందని చెబుతున్నారు. మరి జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? అసలు పోటీకి దిగుతుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story

