Fri Mar 27 2026 01:01:12 GMT+0530 (India Standard Time)
24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడ తాను ఏపీలో పర్యటించనున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2009 నుంచి తాను ప్రమాదం నుంచి బయటపడటానికి కొండగట్టు ఆంజనేయ స్వామి కటాక్షమే కారణమని పవన్ కల్యాణ్ నమ్ముతారు. అందుకే ఆయన తన వాహనానికి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.
కొండగట్టులో వారాహికి...
అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం పై ఆయన నేతలతో చర్చిస్తారు. అదే రోజున నారసింహయ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అదేరోజు ధర్మపురి లక్ష్మీ నారసింహ స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
Next Story

