Sat Mar 28 2026 06:30:50 GMT+0530 (India Standard Time)
సమతామూర్తిని దర్శించుకున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చింతల్ లో ఉన్న సమతా విగ్రహాన్ని దర్శించుకున్నారు. 108 దివ్యాలయాలను కూడా దర్శించుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చింతల్ లో ఉన్న సమతా విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆయన 108 దివ్యాలయాలను కూడా దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ చినజీయర్ స్వామికి పాదాభివందనం చేశారు. చిన జీయర్ స్వామి వల్లనే ఇది సాధ్యమయిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడకు రావడం తనకు సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మోదీకే ఆ అర్హత....
108 దేవాలయాలు ఒకే చోట నిర్మించడం మామూలు విషయం కాదన్నారు. దీనికి మహాసంకల్పం కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దివ్యక్షేత్రం హైదరాబాద్ కు మరో వరంగా మారనుందని అన్నారు. రాజకీయాలను పక్కన పెడితే సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోదీకే ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
Next Story

