Tue Apr 07 2026 11:54:55 GMT+0530 (India Standard Time)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక వార్డులో గెలిచింది

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక వార్డులో గెలిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి గెలిచారు.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
బలపడాలని చూస్తున్న...
తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేరేడుచర్లలో జనసేన కార్యకర్తల్లో ఇప్పుడు కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. మొత్తం 200కు పైగా స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు ఈ మొదటి గెలుపు మంచి ఊపునిస్తోంది. మరిన్ని చోట్ల గెలుస్తామని చెబుతోంది.
Next Story

