Sun Mar 22 2026 08:54:48 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పవన్ ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధరాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. పవన్ నివాసంలో మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.
బీజేపీకి మద్దతుగా...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి పవన్‌ను కలిసిన కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు ప్రచారంలో పాల్గొనాలని పవన్ కల్యాణ్ కోరగా అందుకు సమ్మతించారు. బీజేపీ, జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ జనసేన ట్వీట్ చేసింది.
Next Story

