Wed Jan 28 2026 21:04:20 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ను చంద్రబాబు ఆటాడుకుంటారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెలంగాణలో బలపడటానికి కేసీఆర్ అవకాశమిచ్చారని అన్నారు

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో బలపడటానికి కేసీఆర్ అవకాశమిచ్చారని అన్నారు. జగ్గారెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదాన్ని పూర్తిగా చంపేసిన కేసీఆర్ తిరిగి ఆంధ్రమూలాలున్న పార్టీలకు ఇక్కడ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను తెలంగాణలో ఒక ఆట ఆడుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ గా మార్చి....
టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారని, వారు ఇక్కడ బలపడేందుకు ఎందుకు ప్రయత్నించరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జాతీయ పార్టీ పేరుతో ఏపీలో పోటీ చేస్తుంటే, టీడీపీ కూడా ఇక్కడ బలపడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి తలెత్తిందని, చంద్రబాబును ఇక తప్పుపట్టడానికి ఏముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
- Tags
- kcr
- jaggareddy
Next Story

