Wed Jan 28 2026 22:39:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి : జగ్గారెడ్డి
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్యకు కారకుడు కూడా పువ్వాడేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై..

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అజయ్ కుమార్ పెద్ద సైకో అని.. అతడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడకు కొందరు పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ఆకట్టుకునేందుకు పువ్వాడ అతిగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు.
కాగా.. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్యకు కారకుడు కూడా పువ్వాడేనంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. సాయిగణేశ్ నుంచి పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలనే పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదని క్లియర్ కట్ గా తెలుస్తోందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనా మంత్రి పువ్వాడ ఇదే తరహాలో వేధింపులకు పాల్పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Next Story

