Sat Dec 13 2025 19:31:39 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ కొబ్బరిచెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టితగలడమేనని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావని ఫైర్ అయ్యారు. చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు దేకడని అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్నావని ప్రచారం జరుగుతోందని, తెలంగాణ ప్రజలంటే నీకు అంత చిన్న చూపా..? అని ప్రశ్నించారు.
ఇక్కడెందుకుంటున్నావ్...
నిజంగా పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు అమ్మేయాలని, ఏపీలో కొనుగోలు చేసుకోవాలని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేయాలి కానీ, ఇక్కడ ఎందుకంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా నీకు? అంటూ పవన్ కల్యాణ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
Next Story

