Wed Jan 21 2026 05:17:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆరుగంటలుగా కొనసాగుతున్న విచారణ
సీబీఐ అధికారుల బృందం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతూనే ఉంది

సీబీఐ అధికారుల బృందం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఆరు గంటలకు పైగానే విచారణ జరుగుతుంది. ఆరుగురు సీబీఐ అధికారుల బృందం కవితను విచారిస్తున్నారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. మరికాసేపట్లో విచారణ ముగిసే అవకాశముందని చెబుతున్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన...
అయితే ఇంత సుదీర్ఘ సమయం కవితను ప్రశ్నిస్తుండటంతో బయట టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నాపత్రం ప్రకారం ఆమెను విచారిస్తున్నట్లు చెబుతున్నారు. న్యాయవాది సమక్షంలోనే కవిత సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నప్పటికీ ఎలాంటి సమాధానాలు చెబుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

