Mon Mar 16 2026 14:14:06 GMT+0530 (India Standard Time)
ముగిసిన సీబీఐ విచారణ
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సీబీఐ అధికారుల విచారణ ముగిసింది

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సీబీఐ అధికారుల విచారణ ముగిసింది. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఆమె స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. కవిత సీీబీఐ అధికారుల విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు.
సుదీర్ఘ విచారణ....
ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి కవితను సీబీఐ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పలు అంశాలపై కవితను సీీబీఐ అధికారులు విచారించినట్లు తెలిసింది. అయితే రేపు కూడా విచారణకు హాజరుకావాలా? లేదా? అన్న విషయంపై మరికాసేపట్లో స్పష్టత రావాల్సి ఉంది.
Next Story

