Sun Apr 12 2026 09:37:15 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు ఇంటర్ ఫలితాలు
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దాదాపు 9.50 లక్షల మంది విద్యార్తులు పరీక్షలకు హాజరయ్యారు.
అధికారి వెబ్ సైట్ లోనే...
గత నెల రోజులకు పై నుంచి విద్యార్థులు వారి తల్లి దండ్రులు ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ఫలితాలను చూడాలంటే www.tgbie.cgg.gov.in లో చూడొచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
Next Story

