Wed Feb 25 2026 10:14:54 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే
తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి

తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు నేటి నుంచి జరుగుతుండటంతో ఉన్నత విద్యాశాఖ కొంత వెసులు బాటు కలిపించింది. విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యమైనప్పటకీ పరీక్ష హలులోకి అనుమతి ఇస్తామని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
రెండు సంవత్సరాలకు కలిపి...
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలను మొత్తం 3,07,949 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. సాధారణంగా హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి అనే నిబంధన ఉన్నప్పటికీ,ఈసారి విద్యార్థులు ఆన్ లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కాగా ఉదయం 09:05 అంటే ఐదు నిమిషాలు ఆలస్యం ఐనా పరీక్ష హలులోకి అనుమతిస్తామని తెలిపారు. ఏదైనాసమస్యలుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబరు 80693 91416, 14416 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
Next Story

