Thu Jan 29 2026 18:04:06 GMT+0000 (Coordinated Universal Time)
loans without interest:తెలంగాణలో మహిళలకు వడ్డీ లేని రుణాలు.. ఎవరు చెప్పారంటే?
రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు

loans without interest:తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని పానగల్ చారిత్రాత్మక పచ్చల ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని శుభవార్త తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని.. త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
కొద్దిరోజుల కిందట డ్వాక్రా మహిళలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చెప్పారు. త్వరలో స్వయం సహకార మహిళా సంఘాలన్నింటికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని చేవెళ్ల సభలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహకార మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Next Story

