Sat Apr 11 2026 09:43:42 GMT+0530 (India Standard Time)
Telangana : రేపు ఇంటర్ ఫలితాలు.. ఎలా చూసుకోవాలంటే?
తెలంగాణలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి

ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దాదాపు 9.50 లక్షల మంది విద్యార్తులు పరీక్షలకు హాజరయ్యారు.
అధికారి వెబ్ సైట్ లోనే...
గత నెల రోజులకు పై నుంచి విద్యార్థులు వారి తల్లి దండ్రులు ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇంటర్ తర్వాత చదువు కీలకం కావడంతో తల్లిదండ్రుల్లో ఒకింత టెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఫలితాలను చూడాలంటే www.tgbie.cgg.gov.in లో చూడొచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Next Story

