Thu Apr 09 2026 11:50:46 GMT+0530 (India Standard Time)
Summer Effect : అసలైన సమ్మర్ ఇదేనట.. మూడు నెలల్లో మటాషేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెనం మీద వేసినట్లు రెండు తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేసవి తీవ్రత మార్చి చివరి వారం నుంచే ప్రారంభమయినా.. ఏప్రిల్ మొదటి వారానికి అది పీక్స్ కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో అడపా దడపా వానలు పడుతున్నాయి. అయినా ప్రయోజనం లేదు. పగటి వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రానికి చిరుజల్లులు అక్కడక్కడ పడుతున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు.
వేసవి తీవ్రతతో...
ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖఅధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 19వ తేదీనుంచి గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నలభై ఎనిమిది నుంచి ఆ పై వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, బయటకు రావడం కంటే ఇంట్లో ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలి అనేక మంది ఇబ్బందులు పడే అవకాశముందని చెబుతున్నారు. రానున్న రెండు రోజుల పాటు వానలు పడినప్పటికీ ఆ తర్వాత ఎండల తీవ్రత మరింత తీవ్రమవుతుందని చెబుతున్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉదయం పది గంటలనుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. వేడిగాలులు, సెగతో తెలంగాణ ప్రజలు ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. చల్లటి గాలి అనేదే లేదు. చెమటతో తడిసి ముద్దయిపోతున్నారు.అక్కడకక్కడ తేలికపాటి వానలు పడుతున్నప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు ఎండల తీవ్రత నుంచి తమను తాము కాపాడుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story

