Sat Jun 21 2025 05:39:57 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ముగిసిన కేసీఆర్ విచారణ.. యాభై నిమిషాలు...?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ కు హాజరైన కేసీఆర్ యాభై నిమిషాల పాటు విచారణలో పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ కు హాజరైన కేసీఆర్ యాభై నిమిషాల పాటు విచారణలో పాల్గొన్నారు. తిరిగి ఎర్రవెల్లి ఫాం హౌస్ కు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పలు డాక్యుమెంట్లను కమిషన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుటకు...
గోదావరి నది నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వినియోగించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు కేసీఆర్ కమిషన్ కు వివరించినట్లు తెలిసింది. మంత్రివర్గం ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని, తీసుకున్న రుణాలను కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఉపయోగించామని కేసీఆర్ కమిషన్ కు వివరించినట్లు తెలిసింది.
Next Story