Thu Feb 06 2025 15:51:35 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ లో ఇన్ఫోసిస్ తో తెలంగాణ ఒప్పందం
దావోస్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

దావోస్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో ఐటీ క్యాంపస్ ను విస్తరించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. దీనివల్ల పదిహేడు వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్ లో పోచారం క్యాంపస్ ను కూడా విస్తరించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమయింది.
కొత్తగా పదిహేడు వేల మందికి...
తెలంగాణలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలను విస్తరించాలని ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఫేజ్ మొదటి దశలో 750 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ భవనాలను నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చింది. తాజాగా కుదిరిన ఒప్పందంతో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను తెలంగాణలో మరింత విస్తరించే దిశగా ముందడుగు పడిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది.
Next Story