Thu Mar 19 2026 08:36:54 GMT+0530 (India Standard Time)
శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు

బెంగళూరు నుంచి వారణాసికి 5-10నిమిషాలకు బయలుదేరిన 6E897 నెంబరు ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 6-16 నిమిషాలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. సాంకేతిక ఇబ్బందులతో అత్యవసర ల్యాండింగ్ చేసామని విమాన సిబ్బంది చెబుతున్నారు.
వేరే విమానంలోకి...
వారణాసికి వెళ్లే ప్రయాణికులను వేరే విమానంలోకి మార్చి పంపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లనే అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వేరే విమానంలో పంపినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర ల్యాండింగ్ కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు తొలుత ఆందోళన చెందారు.
Next Story

