Thu Mar 19 2026 13:53:47 GMT+0530 (India Standard Time)
నేడు ముచ్చింతల్ కు వెంకయ్య
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు.

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొంటారు. ఈ రోజు ముచ్చింతల్ రామనుజా చార్య సహస్రాబ్ది వేడుకలు 11వ రోజు జరుగుతున్నాయి. నిత్య పూజలతో, వేద పండితుల మంత్రాలతో ప్రాంగణంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. ఈరోజు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముచ్చింతల్ కు వచ్చి సమతామూర్తిని దర్శించుకోనున్నారు.
యాగంలో ....
వెంకయ్య నాయుడు సమతామూర్తితో పాటు 108 దివ్యదేశాలను దర్శించుకుంటారు. సమతామూర్తి విగ్రహంపై ఆవిష్కృతమయ్యే త్రీడీ మ్యాపింగ్ ను వెంకయ్య నాయుడు పరిశీలిస్తారు. యాగశాలలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు.
Next Story

