Mon Mar 16 2026 20:13:46 GMT+0530 (India Standard Time)
Weather Report : మరో వారం రోజులు భారీ వర్షాలే.. జాగ్రత్తగా ఉండాల్సిందే
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 23వ తేదీ వరకూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది.
ఈదురుగాలులు...
నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 31వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. ప్రజలు భారీ వర్షాలు కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story

