Fri Mar 06 2026 10:22:54 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణకు కొత్త గవర్నర్
దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో మార్పులు చేశారు

దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సాంధూను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
పలు రాష్ట్రాల్లో మార్పు...
నాగాలాండ్ గవర్నర్‌గా నంద కిశోర్ యాదవ్‌ను నియమించారు. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (విరమణ) సయ్యద్ అతా హస్నైన్ను నియమించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిను పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తమిళనాడు గవర్నర్ బాధ్యతలు కూడా తాత్కాలికంగా నిర్వహిస్తారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కవిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

