Thu Mar 19 2026 18:04:44 GMT+0530 (India Standard Time)
Breaking : హైదరాబాద్లో ఐటీ దాడులు
హైదారాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. ఎక్సెల్ గ్రూపు కంపెనీస్ లలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు

హైదారాబాద్ లో మళ్లీ ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. ఎక్సెల్ గ్రూపు కంపెనీస్ లలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే ఐటీ సోదాలకు బయలుదేరారు. 40 బస్సుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించడానికి వేర్వేరు ప్రాంతాలకు బయలు దేరి వెళ్లారు.
ఎక్సెల్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ లో....
తెల్లవారు జామున నాలుగు గంటలకే ఐటీ సోదాలు చేయడానికి అధికారులు సమాయత్తమై వివిధ వాహనాల్లో బయలుదేరారు. మూడు బస్సుల్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉంది. పెద్దయెత్తున కేంద్ర బలగాలను ఈ సందర్భంగా దించారు. దీంతో ఎక్సెల్ కంపెనీలతో పాటు వాటి డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీ చేసే అవకాశముంది.
Next Story

