Mon Feb 02 2026 03:47:08 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ ఐటీ దాడులు కలకలం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపార వేత్తల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో...
జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లో ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ బిల్డర్ తో పాటు ఫైనాన్షియర్ గా ఉన్న పారిశ్రామికవేత్త కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో కూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.
Next Story

