Wed Jan 28 2026 21:04:40 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : జగ్గారెడ్డి మీసం తిప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మెదక్ మీటింగ్ లో ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పారు

మెదక్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి సవాల్ అంటూ సంకేతాలు పంపారు. మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలవాలని, పోలీసులు ఎవరూ ఏమీ అనరని, రేవంతన్న పైనుంచి అంతా చూసుకుంటారని జగ్గారెడ్డి అన్నారు. ఎవరూ భయపడకుండా కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని కోరారు.
ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా...
ీఈ సమయంలో జగ్గారెడ్డి మీసం తిప్పిన రేవంత్ రెడ్డి అందరినీ అలరించారు. దీంతో వాహనంపై ఉన్న నేతలంతా నవ్వుకున్నారు. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నానని రైతులను అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. తాను మాట ఇస్తున్నానని, రెండు లక్షల రుణ మాఫీ చేసే బాధ్యత తనది అని అన్నారు. వచ్చే సీజన్ లో వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత తనది అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Next Story

