Wed Jan 21 2026 01:48:24 GMT+0000 (Coordinated Universal Time)
Free Bus : సీటు కోసం సిగపట్లు.. ఫ్రీ బస్సులో పాట్లు
ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో మహిళలు కొట్టుకున్న ఘటన తెలంగాణలో జరిగింది

తెలంగాణలో ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. గతంలో ఆటోలు, ప్రయివేటు వాహనాలను ఆశ్రయించిన మహిళలు సయితం ఇప్పుడు ఆర్టీసీ బస్సు కోసం గంటలు తరబడి వెయిట్ చేస్తుండటం అనేక బస్టాండ్ లలో కనిపిస్తుంది.
దుబ్బాక వెళ్లే బస్సులో...
అయితే సీట్లు తక్కువ.. మహిళ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఘర్షణలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో మహిళలు కొట్టుకున్న ఘటన తెలంగాణలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. సీటు కోసమే ఈ గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Next Story

