Thu Dec 18 2025 18:05:55 GMT+0000 (Coordinated Universal Time)
Munugode by election : టీఆర్ఎస్ బీజేపీ నువ్వా, నేనా?
మునుగోడు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ దే ఆధిక్యం కనపడింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయింది.

పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ దే ఆధిక్యం కనపడింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయింది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు తొలుత లెక్కించారు. ఈ పోస్టల్ బ్యాలట్ లో రెండు పార్టీలూ హోరా హోరీగా ఉన్నాయి. టీఆర్ఎస్ కు కేవలం నాలుగు ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది.
నాలుగు ఓట్లు మాత్రమే...
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 228 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 224 ఓట్లు వచ్చాయి. దీంతో నాలుగు ఓట్లు ఆధిక్యతంతో ఉంది. బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు, ఇతరులకు 88 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలట్ లెక్కింపు పూర్తికావడంతో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
Next Story

