Sat Mar 07 2026 19:01:32 GMT+0530 (India Standard Time)
ఈనెలలో పాఠశాలలకు వరస సెలవులు
సెప్టెంబరు నెలలో విద్యార్థులకు వరస సెలవులు వస్తున్నాయి. దీంతో వారు తెగ సంతోషపడిపోతున్నారు

సెప్టెంబరు నెలలో విద్యార్థులకు వరస సెలవులు వస్తున్నాయి. దీంతో వారు తెగ సంతోషపడిపోతున్నారు. సెప్టంబరు నెలలో వినాయక చవితి పండగ వచ్చింది. ఈ నెల 7వ తేదీ శనివారం కావడంతో ఆ రోజు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఎటూ ఆదివారం సెలవు దినం కావడంతో వరసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి.
మూడు రోజులు...
ఇక సెప్టెంబరు 14వ తేదీన రెండో శనివారం కూడా పాఠశాలలకు సెలవు. తర్వాత రోజు ఆదివారం, మూడోరోజైన సోమవారం కూడా సెలవు దినమే. ఆరోజు మిలాద్ ఉన్ నబీ ఉండటంతో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలకు వరసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చినట్లయింది.
Next Story

