Thu Sep 12 2024 12:13:57 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో పోస్టర్ల కలకలం
మునుగోడు నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫొటోతో ఫోన్ పే తరహాలో పోస్టర్లు వెలిశాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం మొదలయింది. అభ్యర్థుల మీద వ్యతిరేక ప్రచారంతో ప్రజల్లోకి పార్టీలు వెళుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫొటోతో ఫోన్ పే తరహాలో పోస్టర్లు వెలిశాయి. మునుగోడు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో రాత్రికి రాత్రి ఈ పోస్టర్లు వెలియడంతో బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కోమటిరెడ్డికి వ్యతిరేకంగా...
18000 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టు రూపంలో కేటాయించిందని పోస్టర్లలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎవరు ఈ పోస్టర్లు వేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి కాంట్రాక్టుల కారణంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు కాంట్రాక్టు సాధారణ పద్ధతుల్లోనే లభించిందని, తనకు ఈ కాంట్రాక్టుకు సంబంధం లేదని చెబుతున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story