Wed Jan 21 2026 06:43:32 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడుల నేటి నుంచి గడప గడపకు కాంగ్రెస్
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ మునుగోడులోనే తిష్ట వేయనున్నారు. ఇప్పటికే ఒక దఫా బహిరంగ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మరో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అభ్యర్థి ఎంపిక పూర్తయిన వెంటనే మునుగోడులో మరో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
అభ్యర్థి ఎంపికపై...
అభ్యర్థి ఎంపిక పై రాష్ట్ర స్థాయిలో ప్రక్రియ పూర్తయింది. ఏఐసీసీకి పేర్లను పంపింది. త్వరలోనే ఏఐసీీసీ నుంచి మునుగోడు అభ్యర్థి ప్రకటన రానుంది. అయితే అభ్యర్థి ప్రకటనతో సంబంధం లేకుండా ప్రజల వద్దకు వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈ మేరకే గడప గడపకు కాంగ్రెస్ ను అమలు చేస్తుంది. పార్టీ అభ్యర్థి కంటే గుర్తును బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగనుంది. నాయకులందరూ ఐక్యంగా పనిచేసి ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.
Next Story

