Fri Mar 20 2026 07:47:15 GMT+0530 (India Standard Time)
కోటి రూపాయల బంగారం పట్టివేత
హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారుల తనిఖీలో కోటి రూపాయల బంగారం బయటపడింది.

హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారుల తనిఖీలో కోటి రూపాయల బంగారం బయటపడింది. విదేశాల నుంచి తీసుకువస్తున్న రెండు కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ లైన్స్ సంస్థలో క్యాటరింగ్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకువచ్చి హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.
విదేశాల నుంచి...
విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న క్యాటరింగ్ ఉద్యోగికి అప్పగించేవారు. తనకు ఇచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఫుడ్ ట్రేలలో సదరు ఉద్యోగి బయటకు తీసుకు వచ్చేవారు. దీనిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. దీని విలువ 1.09 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు.
Next Story

