Fri Dec 19 2025 16:45:09 GMT+0000 (Coordinated Universal Time)
పట్టిస్తే మూడు లక్షలు.. ఫ్లెక్సీల కలకలం
జగిత్యాల జిల్లాలో గోవింద్ పల్లిలో చిట్టీల వ్యాపారి వ్యాపారాన్ని మూసివేశారు. కోట్ల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు.

జగిత్యాల జిల్లాలో గోవింద్ పల్లిలో చిట్టీల వ్యాపారి వ్యాపారాన్ని మూసివేశారు. కోట్ల రూపాయలను వసూలు చేసి పరారయ్యాడు. గత కొద్ది రోజులుగా గోవిందపల్లిలోనే ఈ చిట్టీల వ్యాపారాన్ని గాండ్ల వెంకటి కొనసాగిస్తున్నారు. తన ఇంటిని కూడా తనఖా పెట్టారని తెలుస్తోంది.
కోట్ల రూపాయలు...
చిట్టీలు పెద్ద సంఖ్యలో ప్రజలు కట్టడంతో కోట్ల రూపాయలు కూడబెట్టాడు. ఒక్కసారిగా బిచాణా ఎత్తివేశారు. దీంతో గ్రామస్థులందరూ కలసి జిగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గాండ్ల వెంకటిని పట్టిస్తే మూడు లక్షల రూపాయలను ఇస్తామని ఫ్లెక్సీలను పెట్టారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

