Sat Dec 06 2025 02:30:09 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు తరుణ్ చుగ్ కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అరాచకం చేసిందన్నారు. మునుగోడులో బీజేపీదే గెలుపని, కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు అర్థంచేసుకున్నారన్నారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. ఆ వీడియోలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కు బై బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తరుణ్ చుగ్ అన్నారు.
ఆలయంలో ప్రమాణం చేయగలరా?
మునుగోడు పోలింగ్ కు గంట ముందు వరకూ మంత్రులు అక్కడే ఉన్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ ను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధానిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని ఆయన కొట్టిపారేశారు. కేసీఆర్ రాష్ట్రానికి చేసింది చెప్పడానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదని, తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే దేవుడి ఎదుట ప్రమాణం చేశారన్నారు. కేసీఆర్ కూడా ప్రమాణం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
- Tags
- tarun chugh
- kcr
Next Story

