Fri Mar 20 2026 15:56:01 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం
డు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా జరగనుంది.

నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. మోదీ కూడా వరసగా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వేడిని మరింత పెంచారు.
లోక్సభ ఎన్నికల్లో...
అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అందుకోసమే నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

