Mon Mar 23 2026 15:22:56 GMT+0530 (India Standard Time)
Breaking : కామారెడ్డిలో కేసీఆర్ మూడో ప్లేస్
రాష్ట్రమంతటా కాంగ్రెస్ వేవ్ ఉంటే..కామారెడ్డిలో మాత్రం కమలం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది

రాష్ట్రమంతటా కాంగ్రెస్ వేవ్ ఉంటే..కామారెడ్డిలో మాత్రం కమలం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. వచ్చే రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
రెండో స్థానంలో రేవంత్...
కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేయడంతో పాటు తాను పుట్టిన నియోజకవర్గమంటూ సెంటిమెంట్‌ను రాజేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ ద్వితీయ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలలో ఎవరైనా గెలవచ్చు కానీ.. కేసీఆర్ మాత్రం మూడో స్థానానికి నెట్టివేయబడటం కొంత ఆలోచించాల్సి ఉంటుంది.
Next Story

