Wed Mar 18 2026 22:45:00 GMT+0530 (India Standard Time)
తెలంగాణ హైకోర్టుకు స్మితా సబర్వాల్
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికలో తన పేరు తొలగించాలని హై కోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా చేసిన స్మిత సబర్వాల్ నుకూడా కమిషన్ తప్పుపట్టింది. దీంతో ఆమె తన పేరును తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు.
కాళేశ్వరం బ్యారేజీ అవకతవకలలో...
మూడు బ్యారేజీల నిర్మాణంతో తనకు సంబంధం లేదని స్మితా సబర్వాల్ పిటీషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే ఫైళ్లను మాత్రమే తాను పరిశీలించానని, అందులో లోపాలను సరిచేయడం వరకే తన పాత్ర అని స్మితా సబర్వాల్ పిటీషన్ లో పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ పిటీషన్ పై త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది.
Next Story

