Fri Mar 20 2026 17:31:05 GMT+0530 (India Standard Time)
నేడు ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ, ఈడీ విచారణ
ఫార్ములా-ఈ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరుకానున్నారు

ఫార్ములా-ఈ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరుకానున్నారు. విచారణకు రావాలని ఇప్పటికే అరవింద్ కుమార్ కు, బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.రేపు బీఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ ఎదుట హాజరవుతారు. ఈరోజు బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ కు హాజరు కావాల్సి ఉంది. ఈనెల 16వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారు.
భారీ బందోబస్తు...
ఫార్ములా-ఈ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. నిన్న అధికారుల ఇళ్లలో సోదాలు జరిపింది. ఈరోజు కీలక డాక్యుమెంట్లను పరిశీలించనుంది. దీంతో హైదరాబాద్ ఏసీబీ కార్యాలయం వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ అటు వైపు రాకుండా ఆంక్షలు విధించారు. మరో వైపు నేడు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

