Thu Mar 19 2026 16:44:26 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ... క్యూ కడుతున్న ఐపీఎస్, ఐఏఎస్లు
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి భారీ భద్రత పెంచారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. డీజీపీ అంజనీకుమార్ కూడా వచ్చి రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి అభినందించి వెళ్లారు. పోలీసు అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా రేవంత్ ఇంటికి వస్తుండటంతో అక్కడ కోలాహలంగా మారింది.
సోనియాకు బర్త్డే గిఫ్ట్...
సోనియా గాంధీకి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తున్నామని రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు పెద్దయెత్తున బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ పేరిట నినాదాలు చేస్తున్నారు.
Next Story

