ఆ ఫోన్ నా దగ్గర లేదు.. కొత్తది వాడుతున్నా: కేటీఆర్
ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ ఇచ్చిన నోటీసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ ఇచ్చిన నోటీసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లేఖ ద్వారా ఏసీబీకి సమాధానమిచ్ఛారు. ఫార్ములా ఈ రేసు కేసులో జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని కేటీఆర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణకు అన్ని రకాలుగా సహకారం అందించానన్నారు.
అప్పట్లో వినియోగించిన ఫోన్ తన వద్ద లేదని స్పష్టం చేశారు. పాత ఫోన్ ప్రస్తుతం తన దగ్గర లేదని, గత ఏడాది కొత్త ఫోన్ తీసుకుని అదే వాడుతున్నానని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు విచారణకు అవసరమైన అన్నిరకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ఆయా ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించాలని కోరడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని కేటీఆర్ అన్నారు.

