Sun Mar 15 2026 14:07:36 GMT+0530 (India Standard Time)
Hydra : హైడ్రాకూల్చివేతలు ప్రారంభం... డిఫెన్స్ కాలనీలో
హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభించింది. నేరేడ్ మెంట్ డిఫెన్స్ కాలనీలో కూల్చివేతలను ప్రారంభించింది.

హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభించింది. నేరేడ్ మెంట్ డిఫెన్స్ కాలనీలో కూల్చివేతలను ప్రారంభించింది. పార్కు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో పార్కు స్థలాన్ని కొందరు హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆక్రమించారని హైడ్రాకు నేరుగా స్థానికులు ఫిర్యాదులు చేయడంతో అధికారులు పరిశీలించారు.
కబ్జాకు గురైన...
పార్క్ స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించుకున్న అధికారులు ఈరోజు ఉదయం కూల్చివేతలను ప్రారంభించారు. పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆ సమయంలో ఎవరూ వచ్చి అడ్డుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్త ఏడాది తొలి రోజున హైడ్రా తిరిగి కూల్చివేతలను మొదలుపెట్టందనే అనుకోవాలి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

