Sun Feb 09 2025 21:42:15 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభం
హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలో ఒక ఇంటిని కూల్చివేశారు

హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలో ఒక ఇంటిని కూల్చివేశారు. అక్రమంగా రోడ్డును ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారులు మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న బుల్ డోజర్లు మళ్లీ బయలుదేరాయి.
రోడ్డును ఆక్రమించుకుని...
రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంటే స్పందించిన అధికారులు అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. ఇంటి యజమాని కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో క్షణాల్లో ఇల్లు నేలమట్టమయింది. ఈ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తును చేపట్టారు.
Next Story